
ఓ హీరో సినిమాలో మరో హీరో స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తే సినిమా ఏ రేంజ్లో ఉంటుందో మనకు తెలిసిందే. అయితే కొద్దిరోజులుగా సూర్య మాస్ ఎంటర్టైనర్ గా వస్తున్న సింగం సీరీస్ ఎస్-3లో యంగ్ రెబల్ స్టార్ బాహుబలి ప్రభాస్ ఓ స్పెషల్ గెస్ట్ రోల్ వేస్తున్నాడని టాక్ వచ్చింది. అయితే మీడియా అంతా రచ్చ రచ్చ చేస్తున్న ఈ న్యూస్ గురించి ఆ సినిమా దర్శకుడు స్పందించడం జరిగింది. ఎస్-3 లో ప్రభాస్ ఉన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని దర్శకుదు హరి క్లియరెన్స్ ఇచ్చాడు.
కోలీవుడ్ స్టార్ హీరో అయిన సూర్య తెలుగు హీరోలందరితో మంచి స్నేహ బంధం కలిగి ఉన్నాడు. ఇప్పటికే తన సినిమాల తెలుగు ఆడియోలకు ఇక్కడ హీరోలను వాడటం అలవాటే. ఆ క్రమంలోనే సింగం సీరీస్ లో మూడో పార్ట్ గా వస్తున్న ఎస్-3 కు అధనపు ఆకర్షణగా ప్రభాస్ తో ఓ కెమైయో ఇప్పించారని నిన్న మొన్నటి టాక్. కాని దర్శకుడే వచ్చి అలాంటిదేమి లేదు అని చెప్పాడంటే అదో పెద్ద రూమరే అని తేలింది. ఇక ప్రభాస్ లేడు సరే కాని కార్తి మాత్రం ఉండే అవకాశాలున్నాయని తెలుస్తుంది.
తెలుగులో సూర్యతో పాటుగా దాదాపు అదే రేంజ్ మార్కెట్ సాధించాడు కార్తి. పక్కింటి కుర్రాడిగా కార్తి చేసే సహజ నటన తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. రీసెంట్ గా ఊపిరితో హిట్ అందుకున్న కార్తి త్వరలో కాష్మోరాగా రాబోతున్నాడు.