
మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు మంచి ఫాంలో ఉందని చెప్పాలి. బాహుబలితో అమ్మడి కెరియర్ మంచి ఊపందుకుంది. అయితే ప్రస్తుతం తమన్నా చేసి అభినేత్రి రిలీజ్ కు రెడీ అవుతుండగా ఇప్పుడు అమ్మడి గురించి మరో హాట్ న్యూస్ టాక్ ఆఫి ది టౌన్ గా నిలించింది. అభినేత్రి లాంటి సినిమాలో నటించిన తర్వాత తానేందుకు నిర్మాతగా మారకూడదు అని ఆలోచిస్తుందట తమన్నా. ఇప్పటికే బాలీవుడ్లో కొంతమంది భామలు తమ అభిరుచికి తగ్గట్టు సినిమాలను తీసేందుకు నిర్మాతలుగా మారారు.
ఇక వారి దారిలోనే తమన్నా కూడా నిర్మాతగా మారేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే దీనికి సంబందించిన చర్చలు జరుగుతున్నాయట. మరి తమన్నా నిర్మాతగా ఉంటే దర్శకుడు ఎవరు ఏ హీరోతో తమన్నా సినిమా తీస్తుంది. ఇంతకీ తన సినిమాలో హీరోయిన్ ఆమేనా లేక వేరే హీరోయిన్ ను అవకాశం ఇస్తుందా ఇలాంటివన్ని ఇంకా బయటకు రాలేదు.
ఏది ఏమైనా తన టేస్ట్ కు తగ్గట్టు సినిమాల్లో నటించడమే కాదు నిర్మాణ రంగం వైపు అడుగులేయాలనుకుంటున్న తమన్నాని మెచ్చుకోకుండా ఉండలేం. మరి అమ్మడు ఎలాంటి సినిమాతో నిర్మాతగా ప్రమోట్ అవుతుందో చూడాలి.