పునీత్ రాజ్ కుమార్ ఫ్యామిలీని కలిసిన రాం చరణ్..!

కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం సౌత్ సినీ పరిశ్రమను షాక్ అయ్యేలా చేసింది. దేశవ్యాప్తంగా సినీ అభిమానులంతా శోఖ సముద్రంలో మునిగిపోయారు. చిన్న వయసులోనే ఆయన మృతి చెందడం సినీ ప్రియులను తీవ్రంగా బాధించింది. పునీత్ రాజ్ కుమార్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. చిరంజీవి, బాలకృష్ణ, ఎన్.టి.ఆర్, వెంకటేష్, శ్రీకాంత్ లాంటి వారి బెంగళూరు వెళ్లి పునీత్ రాజ్ కుమార్ ను చివరిచూపు చూసి ఆయన ఫ్యామిలీకి సానుభూతి తెలియచేశారు. 

ఆ టైం లో అందుబాటులో లేని కొందరు వరుసగా పునీత్ ఫ్యామిలీని కలిసి తమ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా నాగార్జున బెంగళూరు వెళ్లి పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. బుధవారం రాం చరణ్ బెంగళూరు వెళ్లి పునీత్ రాజ్ కుమార్ ఫ్యామిలీ మెంబర్స్ ను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా పునీత్ రాజ్ కుమార్ తో తనకు ఉన్న అనుబంధాన్ని చరణ్ గుర్తుచేసుకున్నారు. పునీత్ ఫ్యామిలీ మెంబర్స్ ను కలిసిన చరణ్ బాగా ఎమోషనల్ అయ్యారని తెలుస్తుంది.