
హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వచ్చిన పెళ్లిసందడి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన శ్రీలీల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఆ సినిమా రిలీజ్ అవడమే ఆలస్యం మాస్ మహరాజ్ రవితేజ సినిమాలో ఛాన్స్ అందుకున్న శ్రీలీల లేటెస్ట్ గా అమ్మడి ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్ వచ్చి చేరింది. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్ లో ఆశిష్ రెడ్డి హీరోగా వస్తున్న సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా ఛాన్స్ అందుకుందని టాక్.
దిల్ రాజు ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోగా ఆశిష్ రెడ్డి మొదటి సినిమా రౌడీ బోయ్స్ రిలీజ్ అవకుండానే మరో సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. రౌడీ బోయ్స్ లో అనుపమ పరమేశ్వరన్ తో రొమాన్స్ చేసిన ఆశిష్ సెకండ్ సినిమాకు శ్రీలీలతో జోడీ కడుతున్నాడని తెలుస్తుంది. దిల్ రాజు బ్యానర్ లో సినిమా అంటే శ్రీలీల లక్కీ అన్నట్టే లెక్క.