
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కలిసి చేస్తున్న హ్యాట్రిక్ మూవీ పుష్ప డిసెంబర్ 17న రిలీజ్ ఫిక్స్ చేశారు. సినిమా నుండి రిలీజైన మూడు సాంగ్స్ అంచనాలు పెంచేశాయి. పుష్ప రాజ్ పాత్రని పరిచయం చేస్తూ వచ్చిన ఫస్ట్ లుక్ టీజర్ అలరించగా లేటెస్ట్ గా పుష్ప సినిమా నుండి టీజర్ రిలీజ్ ప్లాన్ చేఏస్తున్నారట. నవంబర్ 4 దీపావళి సందర్భంగా పుష్ప టీజర్ వస్తుందని తెలుస్తుంది.
సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా ఆది పినిశెట్టి, సునీల్, ఫాహద్ ఫాజిల్ వంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు. పుష్ప సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుందని అంటున్నారు. పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపించాడని అంటున్నారు. పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న పుష్ప ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.