దేవరకొండ 'పుష్పక విమానం' ట్రైలర్..!

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ మరో కొత్త సినిమాతో వస్తున్నాడు. పుష్పక విమానం అంటూ ఓ సూపర్ హిట్ క్లాసిక్ మూవీ టైటిల్ తో ఆనంద్ దేవరకొండ వస్తున్నాడు. ఈ సినిమాను దామోదర డైరెక్ట్ చేస్తున్నారు. వినయ్ దేవరకొండ నిర్మిస్తున్న ఈ సినిమలో ఆనంద్ దేవరకొండ సరసన గీత్ సైని, శాన్వి మేఘన హీరోయిన్స్ గా నటించారు. 

నవంబర్ 12న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. గవర్నమెంట్ టీచర్ గా చేస్తున్న హీరో పెళ్లి చేసుకున్న వారానికి భార్య ఇంటి నుండి లేచిపోతే.. దాన్ని కవర్ చేసేందుకు చేసిన ప్రయ్త్నం.. ఫైనల్ గా విషయం రివీల్ చేయడం. పోలీసుల ఇంటరాగేషన్ ఇలా ట్రైలర్ మొత్తం చాలా ఎంటర్టైనింగ్ గా అనిపిస్తుంది. సినిమాలో సునీల్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. మొత్తానికి పుష్పక విమానం ట్రైలర్ ఇంప్రెస్ చేయగా సినిమా ఎలా ఉంటుందో చూడాలి.