మంచి రోజులు వచ్చాయి ట్రైలర్..!

సంతోష్ శోభ, మెహ్రీన్ జంటగా మారుతి డైరక్షన్ లో వస్తున్న సినిమా మంచి రోజులు వచ్చాయి. దీపావళి కానుకగా నవంబర్ 4న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా ట్రైలర్ ఇప్పటికే అంచనాలు పెంచగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సందర్భంగా చిత్రయూనిట్ మంచి రోజులు వచ్చాయి నుండి రెండో ట్రైలర్ రిలీజ్ చేశారు. సినిమా నుండి వచ్చిన ఈ సెకండ్ ట్రైలర్ కూడా అలరించింది. 

మారుతి మార్క్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. తప్పకుండా సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకుంటుందని చెబుతున్నారు. ఆల్రెడీ ఏక్ మిని కథతో హిట్ అందుకున్న సంతోష్ శోభన్ మంచి రోజులు వచ్చాయి సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు.