
బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా RRR. ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. సినిమాలో రియల్ ఫ్రీడం ఫైటర్స్ అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్ పాత్రల్లో చరణ్, ఎన్.టి.ఆర్ నటిస్తున్నారు. 2022 జనవరి 7న ఈ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రలను పరిచయం చేస్తూ టీజర్లు రాగా లేటెస్ట్ గా సినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ ప్లాన్ చేశారు.
అసలైతే ఈరోజు రిలీజ్ అవ్వాల్సిన ఆ ఫస్ట్ గ్లింప్స్ ను నవంబర్ 1కి వాయిదా వేశారు. నవంబర్ 1న ఉదయం 11 గంటలకు RRR సినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అవుతుంది. ఇప్పటికే అంచనాలు తారాస్థాయిలో ఉన్న ఆర్.ఆర్.ఆర్ సినిమా ఫస్ట్ గ్లింప్స్ తో మరింత అంచనాలు పెంచాలని చూస్తున్నారు. సినిమాను కూడా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.