పునీత్ చివరి చూపు.. కదిలిన టాలీవుడ్ ప్రముఖులు..!

హార్ట్ ఎటాక్ తో మృతి చెందిన కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ను చివరిచూపు చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున బెంగళూరు చేరుకున్నారు. ఉదయం నుండి ఎంతోమంది పునీత్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. టాలీవుడ్ నుండి బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, ఎన్.టి.ఆర్ బెంగళూరు చేరుకుని పునీత్ పార్ధివ దేహానికి నివాళులర్పించారు. 


సినీ, రాజకీయ ప్రముఖులు మాత్రమే కాదు పునీత్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఆయన్ను ఆఖరి చూపు చూసుకోవాలని వస్తున్నారు.