బాలాతో సూర్య.. 18 ఏళ్ల తర్వాత..!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తమిళ విలక్షణ దర్శకుడు బాల కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుందని తెలుస్తుంది. బాలా డైరక్షన్ లో సూర్య హీరోగా రెండు సినిమాలు వచ్చాయి పితామగన్, నంద సినిమాలు రెండు తమిళంలో సూపర్ హిట్ అయ్యాయి. పితామగన్ సినిమా తెలుగులో శివపుత్రుడుగా రిలీజై సూపర్ హిట్ అయ్యింది. ఇక 18 ఏళ్ల తర్వాత బాల డైరక్షన్ లో సూర్య సినిమా చేస్తున్నారు. ఈ విషయాన్ని సూర్య స్వయంగా ప్రకటించారు.

తమిళంలోనే కాదు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న సూర్య బాలతో హ్యాట్రిక్ సినిమా చేయడం ఆయన ఫ్యాన్స్ ను కూడా అలరిస్తుంది. ప్రస్తుతం సూర్య జై భీం సినిమా చేస్తున్నారు. ఈమధ్యనే వచ్చిన సినిమా టీజర్ ప్రేక్షకులను అలరిస్తుంది.