రొమాంటిక్ ప్రీమియర్ టాక్..!

పూరీ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా కొత్త హీరోయిన్ కేతిక శర్మ ఫీమేల్ లీడ్ గా నటించిన సినిమా రొమాంటిక్. అనీల్ పాదూరి డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు కథ, మాటలు అందించారు పూరీ జగన్నాథ్. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ అంచనాలు పెంచేశాయి. పూరీ మార్క్ మాస్ అండ్ లవ్, ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది.

సినిమా రిలీజ్ కు రెండు రోజుల ముందే మహేష్ ఏ.ఎం.బి మాల్ లో ప్రీమియర్స్ వేశాడు పూరీ. సినిమా చూసిన రాజమౌళి, హరీష్ శంకర్, అనీల్ రావిపుడి, వంశీ పైడిపల్లి, హీరో సత్యదేవ్, ఆలి అంతా సినిమా సూపర్ అనేశారు. ఇంటెన్స్ లవ్ స్టోరీగా వస్తున్న ఈ సినిమా ముఖ్యంగా క్లైమాక్స్ లో ఆకాష్ పూరీ అదరగొట్టేశాడని అందరు చెప్పారు. రొమాంటిక్ ప్రీమియర్స్ టాక్ పాజిటివ్ గానే ఉందని చెప్పొచ్చు.