ఆ ఫోటోలన్ని డిలీట్ చేసిన సమంత..!

నాగ చైతన్యతో డైవర్స్ ఎనౌన్స్ మెంట్ తర్వాత విహార యాత్రలు చేస్తూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న సమంత తన గురించి ఇష్టం వచ్చినట్టుగా వార్తలు రాస్తున్న.. ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా ఛానెల్స్ మీద కేస్ ఫైల్ చేసిన విషయం తెలిసిందే. డైవర్స్ గురించి చెబుతూ తమకంటూ కొంత స్పేస్ కావాలని అర్ధం చేసుకోవాలని సమంత రిక్వెస్ట్ నోట్ పెట్టినా సరే సోషల్ మీడియాలో రకరకాల కథనాలు ప్రసారం చేస్తున్నారు. అందుకే సమంత ఇక మీదట అలా తప్పుడు వార్తలను ప్రసారం చేసిన వారిపై లీగల్ యాక్షన్ తీసుకోవాలని నిర్ణయించుకుంది.

ఇదిలాఉంటే చైతుతో విడిపోతున్న సమంత అతనితో జ్ఞాపకాలను కూడా చేరిపేయాలని చూస్తుంది. అందుకే తన సోషల్ మీడియాలో నాగ చైతన్యతో దిగిన ఫోతోలన్నిటిని డిలీట్ చేసింది. చైతుతో ఎంగేజ్మెంట్, మ్యారేజ్ ఫోటోలను కూడా సమంత తన ఇన్ స్టా గ్రాం లో డిలీట్ చేసింది. అయితే అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీ మెంబర్స్ తో దిగిన ఫోటోలు మాత్రం డిలీట్ చేయలేదు.