
మెగాస్టార్ చిరంజీవి ఆచార్య తర్వాత ఇప్పటికే లూసిఫర్ రీమేక్ గా చేస్తున్న గాడ్ ఫాదర్ సెట్స్ మీదకు తీసుకెళ్లారు. మోహన్ రాజా డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాతో పాటుగా మెహర్ రమేష్ డైరక్షన్ లో తెరకెక్కే భోలా శంకర్ సినిమాకు కూడా ముహుర్తం ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. నవంబర్ 11న భోళా శంకర్ సినిమా ముహుర్త కార్యక్రమాలు జరుపుకుంటుందని తెలుస్తుంది. ఇక నవంబర్ 15 నుండి సినిమా మొదటి షెడ్యూల్ మొదలు పెడతారని తెలుస్తుంది.
కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ వేదాళం రీమేక్ గా వస్తున్న భోళా శంకర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సిస్టర్ రోల్ లో కీర్తి సురేష్ నటిస్తుంది. ఇక సినిమాలో చిరు సరసన తమన్నా నటించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఆచార్య రిలీజ్ అవడమే ఆలస్యం గాడ్ ఫాదర్, భోళా శంకర్ రెండిటిని పూర్తి చేసి కె.ఎస్ రవీంద్ర డైరక్షన్ లో సినిమాకు రెడీ అవ్వాలని చూస్తున్నాడు మెగాస్టారు.