
అక్కినేని నట వారసుడు అఖిల్ కెరియర్ లో తొలి హిట్ అందుకున్నాడు. అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో అఖిల్ కెరియర్ లో కొత్త ఉత్సాహం వచ్చిందని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం అఖిల్ సురేందర్ రెడ్డి డైరక్షన్ లో ఏజెంట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అఖిల్ మాస్ లుక్ తో కనిపించనున్నాడు. బ్యాచిలర్ ఇచ్చిన హిట్ జోష్ లో అఖిల్ తన రెమ్యునరేషన్ పెంచేశాడని టాక్.
మొదటి సినిమా అఖిల్ నుండి బ్యాచిలర్ వరకు రెమ్యునరేషన్ గురించి పెద్దగా పట్టించుకోని అఖిల్ బ్యాచిలర్ హిట్ పడటమే ఆలస్యం రెమ్యునరేషన్ పెంచాడని చెప్పుకుంటున్నారు. ఏజెంట్ కు ఇదివరకు తీసుకున్న పారితోషికమే తీసుకుంటున్నా ఆ తర్వాత సినిమాలకు మాత్రం రేటు పెంచాడట అఖిల్. మొత్తానికి చినబాబు హిట్టు కొట్టడమే ఆలస్యం రెమ్యునరేషన్ పెంచి షాక్ ఇచ్చాడని తెలుస్తుంది.