బాలయ్య దెబ్బకు థింకింగ్ మారిపోవాలా..!

బాలకృష్ణ హోస్ట్ గా ఆహా లో సరికొత్త టాక్ షో వస్తున్న విషయం తెలిసిందే. అన్ స్టాపబుల్ అంటూ రాబోతున్న ఈ షో ప్రోమో రిలీజ్ చేశారు. ఆహా ఓటీటీలో దీపావళి సందర్భంగా నవంబర్ 4న ఈ షో మొదలు కానుంది. ఇక ప్రోమో బాలయ్య మార్క్ డైలాగ్స్ అదిరిపోయాయి. మాటల్లో ఫిల్టర్ ఉండదు.. సరదాలో స్టాప్ ఉండదు.. సై అంటే సై.. నై అంటే నై.. వన్స్ ఐ స్టెప్ ఇన్.. దెబ్బకు థింకింగ్ మారిపోవాలా.. అంటూ బాలకృష్ణ అదిరిపోయేలా డైలాగ్ చెప్పారు. ఇక వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్ అంటూ ఇప్పటివరకు ఎన్ని టాక్ షోలు వచ్చినా ఆ రికార్డులన్ని తిరగరాసేస్తా అని అంటున్నారు బాలకృష్ణ.

బాలకృష్ణ హోస్ట్ గా టాక్ షో అనగానే ఆడియెన్స్ లో ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇక ఈ షోకి మొదటి గెస్ట్ గా మంచు మోహన్ బాబు వస్తున్నట్టు తెలుస్తుంది. నవంబర్ 4న అన్ స్టాపబుల్ మొదటి ఎపిసోడ్ వస్తుంది. ఈ షో కోసం బాలయ్య బాబు భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది.