
క్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ ఈమధ్య తన ఆం పూర్తిగా కోల్పోయారని చెప్పొచ్చు. చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు అందుకోకపోవడంతో కెరియర్ లో వెనకపడ్డారు కృష్ణవంశీ. ప్రస్తుతం కృష్ణవంశీ డైరక్షన్ లో వస్తున్న సినిమా రంగమార్తాండ. మరాఠి సూపర్ హిట్ సినిమా నట సామ్రాట్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, శివాత్మిక, రాహుల్ సిప్లిగంజ్, ఆలి రెజా లాంటి స్టార్స్ నటిస్తున్నారు.
ఇక ఈ సినిమాకు మరింత క్రేజ్ తెచ్చేలా మెగా వాయిస్ ఓవర్ చెప్పిస్తున్నారట. సినిమా స్టార్టింగ్ లో మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఉంటుందని టాక్. కృష్ణవంశీ స్పెషల్ రిక్వెస్ట్ తో చిరు ఈ సినిమాకు వాయిస్ ఓవర్ అందిస్తున్నట్టు తెలుస్తుంది. తప్పకుండా చిరు వాయిస్ ఓవర్ రంగమార్తాండ సినిమాకు చాలా హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు.