
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి డైరక్షన్ లో వస్తున్న సినిమా గని. అల్లు బాబి నిర్మిస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన సయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది. బాక్సింగ్ నేపథ్యంతో వస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఇక థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుండి గని పాత్రని ఇంట్రడ్యూస్ చేస్తూ యాంతం రిలీజ్ చేశారు. దే కాల్ హిమ్ గని.. కనివిని ఎరుగని.. దే కాల్ హిమ్ గని.. లోకం తనకని..'' అంటూ వచ్చిన ప్రోమో సాంగ్ క్రేజీగా ఉంది.
డిసెంబర్ 3న రిలీజ్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెడుతున్నారు. ఇక గని టైటిల్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేయగా ఫుల్ సాంగ్ అక్టోబర్ 27 ఉదయం 11:08 గంటలకు వస్తుందని తెలుస్తుంది. బాక్సర్ గా కనిపించేందుకు వరుణ్ తేజ్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నట్టు తెలుస్తుంది. వరుస హిట్లతో దూసుకెళ్తున్న వరుణ్ తేజ్ కు ఈ గని ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.