సంక్రాంతికి మహేష్ కష్టమేనా..?

కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈ ఏడాది రిలీజ్ అవ్వాల్సిన చాలా సినిమాలు వాయిదా పడుతూ వచ్చాయి. అయితే మీడియం బడ్జెట్ సినిమాలు ఇప్పటికే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయగా ఈ ఇయర్ మిస్సైన కొన్ని పెద్ద సినిమాలు నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ప్లాన్ చేశాయి. 2022 సంక్రాంతికి ఆర్.ఆర్.ఆర్, రాధే శ్యాం, పవన్ భీమ్లా నాయక్, మహేష్ సర్కారు వారి పాట ఈ నాలుగు సినిమాలు రిలీజ్ ఎనౌన్స్ చేశాయి.

RRR వస్తుంది అంటే అన్ని తప్పుకోవాల్సిందే. అయితే పండుగకి వారం ముందే కాబట్టి పెద్దగా రిస్క్ ఉండకపోవచ్చు. అయితే సంక్రాంతి బరిలో మహేష్, పవన్, ప్రభాస్ లలో బిగ్ ఫైట్ జరుగనుంది. ఏమాత్రం సినిమా తేడా కొట్టినా రిస్క్ లో పడినాట్టే అవుతుంది. అందుకే మహేష్ సర్కారు వారి పాట రిలీజ్ వాయిదా వేస్తున్నట్టు తెలుస్తుంది. సంక్రాంతికి అనుకున్న సినిమా రిలీజ్ కాస్త సమ్మర్ కి షిఫ్ట్ చేశారట. తెలుస్తున్న సమాచారం ప్రకారం 2022 ఏప్రిల్ 28న సర్కారు వారి పాట సినిమా రిలీజ్ ఉంటుందని అంటున్నారు. అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.