
బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న భారీ మూవీ RRR. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఇద్దరు కలిసి నటిస్తున్న ఈ మెగా మల్టీస్టారర్ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. రెండు మూడు సార్లు రిలీజ్ వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఫైనల్ గా 2022 జనవరి 7న రిలీజ్ ఫిక్స్ చేసుకున్నారు. సినిమాలో కొమరం భీం పాత్రలో ఎన్.టి.ఆర్. అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ నటిస్తున్నారు.
సినిమా నుండి వచ్చే ప్రతి అప్డేట్ క్రేజీగా మారగా లేటెస్ట్ గా ఆర్.ఆర్.ఆర్ సినిమా రన్ టైం రివీల్ అయ్యింది. రాజమౌళి ఈ సినిమాను ఎంత ట్రిం చేసినా సరే 3 గంటలు వస్తుందని తెలుస్తుంది. RRR సినిమా 180 నిమిషాలు ఉండటం పక్కా అని అంటున్నారు. మాములుగా అయితే 160 నిమిషాలు మాత్రమే ఉండే సినిమా ఈమధ్య కొన్ని సినిమాలు 2 గంటల 45 నిమిషాల దాకా చేశారు. ఇప్పుడు రాజమౌళి ఏకంగా 3 గంటలు సినిమా చూపిస్తానని అంటున్నారు. మరి ఈ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.