
మెగాస్టార్ నటిస్తున్న ఖైది నెంబర్ 150వ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్టే.. సినిమా నిర్మాత మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఈ సినిమా విశేషాల గురించి చెబుతూ సినిమా అనుకున్నట్టుగానే సూపర్ గా వస్తుందని ఇక రిలీజ్ కు ఒక నెల ముందు అనగా డిసెంబర్లోనే సినిమా మొత్తం పూర్తవబోతుందని అన్నారు. వినాయక్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా తమిళ సూపర్ హిట్ సినిమా కత్తి రీమేక్ గా వస్తుంది.
కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే 70 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యిందని ప్రస్తుతం అయిన షూటింగ్ అంత హ్యాపీగానే జరిగిందని అంటున్నాడు చరణ్. ఈ సినిమాతో మొదటిసారి నిర్మాతగా మారిన చెర్రి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో సినిమాను నిర్మిస్తున్నారు.
సుధీర్ఘ విరామం తర్వాత చిరు చేస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల్లో తీసుకెళ్లే క్రమంలో చిత్రయూనిట్ ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టబోతుంది. ఇక ఇదే కాకుండా చిరు మీలో ఎవరు కోటిశ్వరుదు నాలుగో సీజన్లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ ప్రోగ్రాంకు సంబందించిన టీజర్ ఫ్యాన్స్ ను ఉత్తేజపరుస్తుంది.