విశ్వక్ సేన్ 'గామి' టీజర్ అదిరింది..!

యువ హీరోల్లో సినిమా సినిమాకు కొత్త కథలతో వస్తున్న హీరో విశ్వక్ సేన్. ఈమధ్యనే పాగల్ అంటూ వచ్చి అలరించిన విశ్వక్ సేన్ తన నెక్స్ట్ సినిమా గామి అంటూ టైటిల్ టీజర్ తోనే సర్ ప్రైజ్ చేశాడు. విశ్వక్ సేన్ గామి టీజర్ విషయానికి వస్తే అఘోరాగా ఉన్న విశ్వక్ సేన్ కు ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆ ప్రాబ్లెం సొల్యూషన్ కోసం అతను వెతుకుతూ ఉంటాడు. మరి ఇంతకీ హీరోకి ఉన్న సంస్య ఏంటి.. దాన్ని ఎలా సాల్వ్ చేసుకున్నాడు అన్నది గామి కథ.

విద్యాసాగర్ కగిట డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో చాందిని చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. థ్రిల్లర్ జోనర్ లో వస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ అత్యంత ప్రాధాన్యత వహించనుంది. టీజర్ తోనే మ్యూజిక్ తో అలరించిన నరేష్ కుమరన్ సినిమా మొత్తం ఇదే ఫాం కొనసాగించి ఉంటాడని అంటున్నారు. మొత్తానికి విశ్వక్ సేన్ గామి ఫస్ట్ లుక్ టీజర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచిందని చెప్పొచ్చు.