ఆహా 'అన్ స్టాపబుల్' బాలయ్య..!

నందమూరి బాలకృష్ణ ఆహా కోసం ఒక టాక్ షో చేస్తున్నారన్న విషయం తెలిసిందే. ఆ ప్రోగ్రాం టైటిల్ గా అన్ స్టాపబుల్ అని ఫిక్స్ చేశారు. ఈ షో కర్టెన్ రైజర్ ప్రెస్ మీట్ లో బాలయ్య స్టేజ్ మీద డ్యాన్స్, స్పీచ్ హైలెట్ గా నిలిచాయి. ఆహా కోసం ఈ షో చేయడం సంతోషంగా ఉందని చెప్పిన బాలకృష్ణ యంగ్ టీం తో పనిచేయడం బాగుందని అన్నారు. ఇక స్టార్స్ జీవితాలకు సంబందించి తను అడిగే ప్రశ్నలు.. సమాధానాలు అందరిని అలరిస్తాయని అన్నారు.

ప్రేక్షకులను అలరించడానికి తాను చేయని ప్రయత్నాలు లేవని. అందులో భాగంగానే ఆహా కోసం ఈ అన్ స్టాపబుల్ షో చేస్తున్నట్టు చెప్పారు. అసలు బాలయ్యతో ఒక షో హోస్ట్ చేయించాలని ఆలోచన రావడమే అదో క్రేజీ థింగ్ అని చెప్పొచ్చు. అన్ స్టాపబుల్ షో కోసం బాలయ్య బాబు భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. మరి బాలయ్య హోస్ట్ గా వస్తున్న ఈ షో ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటుందో చూడాలి.