
సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా శివ డైరక్షన్ లో వస్తున్న సినిమా అన్నాత్తే. సన్ పిక్చర్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాలో ననయతార హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు సంబందించిన తెలుగు రెండు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ఏసియన్ నారాయణదాస్ నారంగ్, దగ్గుబాటి సురేష్ బాబు సొంతం చేసుకున్నారని తెలుస్తుంది. దీపావళి కానుకగా నవంబర్ 4న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది అన్నాత్తే. ఈ సినిమాలో కీర్తి సురేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తుంది.
రజిని సినిమాలంటే తెలుగులో భారీ క్రేజ్ ఉంటుంది. ఇక లేటెస్ట్ గా దసరా కానుకగా అన్నాత్తే తమిళ టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూశాక సినిమాపై అంచనాలు పెరిగాయి. సూపర్ స్టార్ రజినికాంత్ స్టామినా చూపించేలా అన్నాత్తే సినిమా ఉంటుందని అంటున్నారు. అన్నాత్తే తెలుగు టీజర్ కోసం ఇక్కడ ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు.