
స్టార్ హీరోయిన్స్ కూడా ఇప్పుడు ఐటం సాంగ్స్ తో మజా తెప్పిస్తుంటే ఇక కుర్ర హీరోయిన్స్ కాదని అంటారా చెప్పండి.. టాలీవుడ్లో రీసెంట్ గానే వచ్చి సూపర్ క్రేజ్ తెచ్చుకున్న రాశి ఖన్నా కూడా అదే మాట చెబుతుంది. తెలుగు సినిమా తనకో ఐడెంటిటీ తెచ్చిందని అందుకే టాలీవుడ్ కోసం ఎలాంటి పాత్రలనైనా చాలెంజింగా చేస్తా అంటున్న ఈ ముద్దుగుమ్మ అవకాశం వస్తే హాట్ ఐటంగా కనిపించేందుకు రెడీ అంటుంది. ఇప్పటికే హీరోయిన్ గా జబర్దస్త్ ఫాంలో ఉన్న రాశి ఇక ఐటం సాంగ్స్ కూడా చేస్తే ఇక ఏమన్నా ఉందా చెప్పండి.
తన హాట్ సోయగాలతో ఇప్పటికే హీరోయిన్ గా చేస్తూనే ప్రేక్షకులను గిలిగింతలు పెడుతున్న రాశి ఐటం కూడా చేస్తే అదుర్స్ అన్నట్టే. ప్రస్తుతం అమ్మడు వరుస సినిమాలతో బిజీగా ఉంది మరి ఎలాగు ఐటం సాంగ్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి స్టార్స్ ఆ ఛాన్స్ ఇస్తారేమో చూడాలి. పర్ఫెక్ట్ ఫిగర్ కు ప్రతిరూపంగా ఉన్న రాశి ఖన్నా ఐటం సాంగ్ కు ఏ హీరో ముందు బుక్ చేసుకుంటాడో చూడాలి. ఈ ఇయర్ మెగా మేనళ్లుడితో సుప్రీం హిట్ అందుకున్న రాశి ఖన్నా లాస్ట్ వీక్ రిలీజ్ అయిన రాం హైపర్ తో కూడా పర్వాలేదు అనిపించుకుంది.
ఇక గోపిచంద్ ఆక్సిజన్ తో పాటుగా మాస్ మహరాజ్ రవితేజ బాబి సినిమాలో కూడా రాశి ఖన్నా ఛాన్స్ దక్కించుకుంది. రకుల్ ప్రీత్ సింగ్ తో పోటీగా కుర్ర హీరోలతో అవకాశాలను దక్కించుకుంటున్న రాశి ఇక స్టార్స్ సినిమాలో ఛాన్స్ కొట్టేయడమే మిగిలుంది.