
పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ప్రస్తుతం చేస్తున్న కాటమరాయుడు సినిమా కోసం దిల్ రాజు క్యాంప్ లో దర్శకత్వ శాఖలో పనిచేసే వాసు వర్మ హెల్ప్ తీసుకోబోతున్నాడట. డాలి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు వాసు వర్మ స్క్రిప్ట్ దగ్గర నుండి అన్ని విషయాల్లో సహకారం అందిస్తున్నాడట. ఆకుల శివ స్క్రిప్ట్ కు తన మార్క్ స్క్రీన్ ప్లే అందించిన డాలి ఇప్పుడు వర్మ హెల్ప్ కూడా తీసుకుంటున్నాడు.
రీసెంట్ గా హైదరాబాద్ లో షెడ్యూ కంప్లీట్ చేసుకుని ఈ నెల 5న తమిళనాడు రామేశ్వరంలో షూటింగ్ కు బయలుదేరుతుంది చిత్రయూనిట్. పవన్ రాకతో కొత్త ఉత్సాహం తెచ్చుకున్న యూనిట్ సినిమాను త్వరగా ఫినిష్ చేసే ఆలోచనతో వాసు వర్మ హెల్ప్ తీసుకుంటున్నాడట. శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ఇక ఈ సినిమాను అనుకున్న టైం కల్లా పూర్తి చేసి త్రివిక్రంతో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు పవన్ కళ్యాణ్. ఆ సినిమాకు టైటిల్ గా దేవుడే దిగి వచ్చినా అనే టైటిల్ పరిశీలణలో ఉందట.