
మా ప్రెసిడెంట్ గా మంచు విష్ణు గెలిచిన అనంతరం వరుసగా మా అసోసియేషన్ మెంబర్ షిప్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటిచడం హాట్ టాపిక్ గా మారింది. రిజల్ట్ వచ్చిన రాత్రే మెగా బ్రదర్ నాగబాబు మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించగా ఆ నెక్స్ట్ డే ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ పెట్టి మరి మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
ఇక ఈసీ మెంబర్స్ రిజల్ట్స్ విషయంలో ఏవో అవకతవకలు జరిగాయని వాదన వినిపిస్తూ దానిపై నరేష్ పై విచారణ జరుగకుంటే తాను కూడా మా సభ్యత్వానికి రాజీనామా చేస్తానని అన్నారు సీనియర్ నటుడు మాజీ మా అధ్యక్షుడు శివాజీరాజా. అయితే వీరంతా ఇలా అంటుంటే కొత్త ప్రెసిడెంట్ అదేనండి మంచు విష్ణు మాత్రం వాళ్లెవరిని వదిలే ప్రసక్తే లేదన్నట్టు మాట్లాడారు.
ప్రకాష్ రాజ్, నాగబాబు వీళ్లిద్దరిని త్వరలో తాను కలుస్తానని.. వీరి రాజీనామా ప్రస్తుతం తాను అంగీకరించనని అన్నారు మంచు విష్ణు. ఇక శివాజీరాజా రాజీనామా చేస్తానంటే ఆయన్ను ఇంటికి వెళ్లి మరి కొరుకుతా అని కామెడీ చేశాడు మంచు విష్ణు. మొత్తానికి మా ఫలితాలతో గొడవ సర్ధుమనుగుతుంది అనుకుంటే ఇప్పుడే అసలు ఆట మొదలైంది అని ప్రకాష్ రాజ్ చెప్పినట్టుగా అసలు వాదనలు ఇప్పుడే మొదలయ్యాయని చెప్పొచ్చు. మరి ఇది ఎలా టర్న్ అవుతుంది అన్నది తెలియాల్సి ఉంది.