
నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన అఖండ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈమధ్యనే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన ఈ సినిమా నవంబర్ ఎండింగ్ కాని డిసెంబర్ ఫస్ట్ వీక్ లో కాని రిలీజ్ ఉండొచ్చని అంటున్నారు. ఇక ఈ సినిమా తర్వాత క్రాక్ డైరక్టర్ గోపీచంద్ మలినేనితో బాలయ్య బాబు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు టైటిల్ గా జై బాలయ్య అని పెట్టే ఆలోచనలో ఉన్నారట. బాలకృష్ణని నందమూరి అభిమానులు ముద్దుగా బాలయ్య అంటుంటారు. ఇక ఆయన పేరుతో జేజేలు పలికే టైం లో జై బాలయ్య అనడం చూస్తూనే ఉంటాం.
ఇప్పుడు దాన్నే టైటిల్ గా గోపీచంద్ మలినేని సినిమా చేస్తున్నాడని అంటున్నారు. మాస్ అండ్ కమర్షియల్ సినిమాగా వస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ మార్క్ ఊర మాస్ సీన్స్ భారీగా ప్లాన్ చేశాడట గోపీచంద్ మలినేని. మాస్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న గోపీచంద్ మలినేనికి మాస్ కా బాప్ అయిన బాలయ్య బాబు దొరికితే ఎలాంటి సినిమా చేస్తాడో ఆ అంచనాలకు ఏమాత్రం గురి తప్పకుండా ఈ సినిమా ఉంటుందని చిత్రయూనిట్ చెబుతున్నారు.