
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ ఆచార్య. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరంజీవితో పాటుగా రాం చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. చిరు, చరణ్ ఇద్దరు కలిసి మెగా ఫ్యాన్స్ కు సూపర్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అసలైతే ఈ ఇయర్ మే నెలలోనే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ వల్ల వాయిదా పడ్డది. మిగతా సినిమాల్లా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసి మళ్లీ వాయిదా వేయడం ఎందుకని అనుకున్న చిత్రయూనిట్. ఫైనల్ గా ఇన్నాళ్లు వెయిట్ చేసి 2022 ఫిబ్రవరి 4న ఆచార్య రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.
నవంబర్, డిసెంబర్ లో ఆచార్య రిలీజ్ ఉంటుందని అనుకున్న మెగా ఫ్యాన్స్ కు ఈ రిలీజ్ డేట్ షాక్ అయ్యేలా చేసినా ఆచార్యకు అదే పర్ఫెక్ట్ డేట్ అని చిత్రయూనిట్ నిర్ణయించింది. సినిమాలో కాజల్, పూజా హెగ్దే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో మొదటి సాంగ్ ఆల్రెడీ సూపర్ హిట్ అయ్యింది.