
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ MAA ఎలక్షన్స్ లో ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు బిగ్ ఫైట్ లో మంచు విష్ణు ఘన విజయం సాధించారు. గత నెల రోజుల నుండి మా ఎలక్షన్స్ లో భాగంగా రెండు ప్యానల్స్ ప్రెస్ మీట్ లు.. వాదనలు.. గొడవలు అందరికి తెలిసిందే. అక్టోబర్ 10 ఆదివారం జరిగిన మా ఎన్నికల్లో దాదాపు 900 ఓట్లు ఉన్న మా సభ్యుల్లో 665 ఓట్లు పోల్ అయినట్టు తెలుస్తుంది. 600 ప్రత్యక్షంగా కాగా.. 65 ఓట్లు మాత్రం పోస్టల్ బ్యాలెట్ ద్వారా వేయించారు.
ఇక టఫ్ ఫైట్ లో మంచు విష్ణు అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. మంచు విష్ణు ప్యానల్ లో ఎనిమిది మంది ఈసీ మెంబర్స్ గెలుపొందగా.. ప్రకాష్ రాజ్ ప్యానల్ లో 11 మంది ఈసీ మెంబర్స్ గెలిచారు. మొత్తానికి మా కొత్త ప్రెసిడెంట్ గా మంచు విష్ణు గెలిచాడు. ఎంతో ప్రయత్నించినా సరే ప్రకాష్ రాజ్ మా ఎలక్షన్స్ లో గెలవలేకపోయారు. మా ఎలక్షస్ లో మంచు విష్ణుకి 381 ఓట్లు పోల్ కాగా.. ప్రకాష్ రాజ్ కు 274 ఓట్లు పోల్ అయ్యాయి. ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు 107 ఓట్ల మెజారిటీతో మా అధ్యక్ష పదవి దక్కించుకున్నారు.