
మూవీ ఆర్టిస్ట్ అసొసియేషన్ ఎన్నికలు కేవలం మూడు రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో నటీనటులకు నిర్మాతల మండలి విజ్ఞప్తి చేసింది. మా ఎన్నికలు అరుగుతున్న సందర్భంగా ఈ నెల 10న ఓటు వేశాకే షూటింగులకు హాజరు కావాలని ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రకటించింది. షూటింగ్స్ ఉండటం వల్ల ఎన్నికల్లో పాల్గొనేందుకు అవకాశం ఉండదు. అందుకే ఓటు వేసిన తర్వాతనే షూటింగులకు రండని నిర్మాతల మండలి ప్రకటించింది. ఎన్నికల అధికారి అభ్యర్ధన మేరకు నిర్మాతల మండలి ఈ ప్రకటన చేసినట్టు తెలుస్తుంది.
అక్టోబర్ 10 ఆదివారం ఉదయం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ లో మా ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్ సభ్యులు విమర్శలు చేసుకుంటున్నారు. మొదట్లో ఐదుగురు సభ్యులు అధ్యక్షులుగా పోటీ చేయాలని అనుకున్నారు. కాని చివరకు ప్రకాష్ రాజ్, మంచు విష్ణులు మాత్రమే అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు.