
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్ వచ్చి చేరింది. అర్జున్ రెడ్డి సినిమాతో సౌత్, నార్త్ అనే తేడా లేకుండా అందరిని అలరించిన డైరక్టర్ సందీప్ వంగ ప్రస్తుతం రణ్ బీర్ కపూర్ తో యానిమల్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేస్తున్నట్టు ఎనౌన్స్ చేశారు. టీసీరీస్ ప్రొడక్షన్ లో భూషన్ కుమార్ ఈ సినిమా నిర్మిస్తున్నారు.
సందీప్ వంగ, ప్రభాస్ అసలు ఊహించని ఈ కాంబోలో వస్తున్న స్పిరిట్ తప్పకుండా యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ అందరిని అలరించేలా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ రావడమే కాదు స్పిరిట్ సినిమాకు పనిచేసేందుకు తాను ఆసక్తిగా ఉన్నానని ప్రభాస్ చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తున్నాయి. ఇప్పటికే రాధే శ్యాం రిలీజ్ కు రెడీగా ఉండగా ఆదిపురుష్, సలార్ సెట్స్ మీద ఉన్నాయి. నాగ్ అశ్విన్ డైరక్షన్ లో ప్రాజెక్ట్ కె ఇంకా సెట్స్ మీదకు వెళ్లలేదు. ఇప్పుడు సందీప్ వంగతో స్పిరిట్ ఎనౌన్స్ మెంట్ వచ్చింది. వరుస పాన్ ఇండియా సినిమాలతో ప్రభాస్ నేషనల్ లెవల్ లో తన సత్తా చాటుతాడని చెప్పొచ్చు.