ప్రకాశ్ రాజ్ వీరంగం కారణం అదండి..!

సౌత్ లో విలక్షణ నటులు అని పేర్లు చెప్పుకుంటూ వస్తే ప్రకాశ్ రాజ్ పేరు ప్రస్థావించకుండా ఉండలేం అయితే తెర మీద గంభీరంగా కనిపించే ప్రకాశ్ రాజ్ బయట మాత్రం చాలా సున్నిత మనస్తత్వం కలవాడు. ప్రెస్ మీట్లలో.. పబ్లిక్ మీట్ లలో తను మాట్లాడే విధానాన్ని బట్టి ఆ విషయం అర్ధం చేసుకోవచ్చు. అయితే అలాంటి ప్రకాశ్ రాజ్ ఓ టివి ఛానెల్ మీద వీరంగం ఆడేశాడు. తను నిర్మించి నటించిన మన ఊరి రామాయణం సినిమా కన్నడలో రిలీజ్ అవుతుంది. 

ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో యాంకర్ సినిమా విశేషాలను అడిగినట్టే అడిగి సడెన్ గా కావేరి వివాదం పై ప్రశ్న వేసింది. ఇక ఆ ప్రశ్నతో షాక్ అయిన ప్రకాశ్ రాజ్ మీ టీఆర్పి రేటింగ్స్ కోసమే అడుగుతున్నారా అసలే ప్రజలు ఆగ్రహావేశాల్లో ఉంటే ఇప్పుడు ఇలాంటి ప్రశ్న వేస్తారా మీది ఏ ఛానెల్ ఇక నుండి ఈ చానెల్ కు ఇంటర్వ్యూలు ఇచ్చేది లేదు అంటూ లైవ్ మధ్యలోనే ఫైర్ అయ్యాడట.

అయితే సందర్భం కాదు అని చెప్పేసి సైలెంట్ అవ్వొచ్చు కాని చానెల్ మీద దూషించడంతో కన్నడ మీడియా ఆ వీడియోని ప్లే చేసి ఇంకాస్త రచ్చ రచ్చ చేస్తుంది. ఇక అది వదిలేస్తే మన ఊరి రామాయణం సినిమా తెలుగు తమిళ కన్నడ భాషల్లో అక్టోబర్ 7న గ్రాండ్ రిలీజ్ అవుతుంది.