ఎన్టీఆర్ తర్వాతే మహేష్..!

టెంపర్ తో హిట్ అందుకున్నా తన మార్క్ సినిమాలను అందించడంలో వెనుకపడ్డ పూరి ఇప్పుడు ఇజంతో మళ్లీ ట్రాక్ ఎక్కేలానే కనిపిస్తున్నాడు. కళ్యాణ్ రాం తో పవర్ ఫుల్ గా ఇజం అంటూ వస్తున్న పూరి ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోలతో సినిమాలకు సిద్ధమయ్యాడు. ఇజం తర్వాత పూరి యంగ్ టైగర్ తో సినిమా దాదాపు కన్ఫాం అయినట్టే. జనతా గ్యారేజ్ హిట్ తో బ్యాక్ టూ ఫాం అని తన సత్తా చాటిన జూనియర్ మరోసారి పూరితో తన టెంపర్ చూపించేందుకు రెడీ అవుతున్నాడు. 

ఇక ఈ సినిమా తర్వాత మహేష్ తో జనగణమన సినిమా స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని పెట్టుకున్నాడు పూరి. మురుగదాస్ సినిమా పూర్తయ్యాక కొరటాల శివతో కమిట్ అయిన మహేష్ ఆ తర్వాత పూరితోనే సినిమా చేసే అవకాశాలున్నాయి. సో మొత్తానికి పూరి మళ్లీ ఫాంలోకి వచ్చేసినట్టే కనిపిస్తున్నాడు. ఈ టైంలో ఇజం కూడా సూపర్ హిట్ అయితే కనుక మళ్లీ పూరి పూర్వ వైభవం తెచ్చుకున్నట్టే. రేసులో వెనుకపడిన మళ్లీ తారక్ మహేష్ సినిమాలతో పూరి తన సత్తా చాటాలని చూస్తున్నాడు.