
టాలీవుడ్ డైరక్టర్స్ లో కసితో సినిమా తీసే దర్శకుడు కేవలం పూరి జగన్నాథ్ ఒక్కడే అంటే నమ్మాలేమో.. హిట్ టార్గెట్ తో పూరి ఫిక్స్ అయితే కనుక అది కచ్చితంగా రికార్డులు బద్ధలే. అయితే కొద్దికాలంగా రేసులో వెనుకపడ్డ పూరి ఈసారి కళ్యాణ్ రాంతో వస్తున్న ఇజంతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు. నిజమైన స్వేచ్చ మనలోని కరేజ్ ను బట్టే ఉంటుందనే పోస్టర్ తో పాటుగా ఇజం ఆడియో అక్టోబర్ 5న అని ఎనౌన్స్ చేశాడు.
అసలైతే సినిమా దసరా సీజన్లో రావాల్సింది కాని పోటీలో చాలా ఉండటంతో సోలోగా వచ్చి సత్తా చాటాలని చూస్తున్నారు. పూరి మార్క్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ తో పాటుగా తన పెన్ పవర్ ను మరోసారి గుర్తుచేసేలా ఉంటుందట ఇజం మూవీ. కళ్యాణ్ రాం కెరియర్ లో ఈ సినిమాకు వస్తున్న పాజిటివ్ బజ్ మరే సినిమాకు రాలేదు. ఇక ఆడియో పోస్టర్ లో కూడా సంకెళ్లతో కళ్యాణ్ రాం ఇంటెన్షన్ అదుర్స్ అనేలా ఉంది.
మరి పూరి చూస్తుంటే ఇజంతో ఓ పెద్ద సంచలనాన్నే సృష్టించేలా ఉన్నాడు. అక్టోబర్ 5న ఆడియోకి యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ చేతుల మీదుగా ఇజం ఆడియో రిలీజ్ అవనుంది. రీసెంట్ గా జనతా గ్యారేజ్ హిట్ తో సత్తా చాటిన తారక్ ఇప్పుడు అన్నకు అదిరే హిట్ అందించాలని ఫ్యాన్స్ ను ఉద్దేశించి మాట్లాడుతాడట.