
నేషనల్ వైడ్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న కుకింగ్ షో మాస్టర్ చెఫ్. ఇప్పుడు ఈ షోని తెలుగు, తమిళ భాషల్లో కూడా ప్లాన్ చేశారు. తెలుగులో తమన్నా హోస్ట్ గా చేస్తున్న ఈ షోని జెమిని టీవీ ప్రసారం చేస్తుంది. ఎన్నో భారీ అంచనాలతో ఈ షో మొదలైంది. షోకి ప్రమోషన్స్ కూడా భారీ రేంజ్ లో చేశారు. అయితే హిందీలో క్లిక్ అయినట్టుగా తెలుగులో ఈ షోకి పెద్దగా రేటింగ్స్ రావత్లేదు.
అంతేకాదు తమన్నా రెమ్యునరేషన్ కూడా భారీగా ఉండటంతో షో బడ్జెట్ కాస్ట్ ఎక్కువ అవుతుందట. అందుకే తమన్నాని హోస్ట్ గా తప్పించాలని ఫిక్స్ అయ్యారట. తమన్నా ప్లేస్ లో జబర్దస్త్ యాంకర్ అనసూయని హోస్ట్ గా తీసుకోవాలని చూస్తున్నారు. జబర్దస్త్ యాంకర్ అనసూయ హోస్ట్ గా మాస్టర్ చెఫ్ రాబోతుందని తెలుస్తుంది. మరి అనసూయ తో మాస్టర్ చెఫ్ ఎలా ఉండబోతుందో చూడాలి.