RRR రిలీజ్.. ఆ రెండు సినిమాలు వాయిదా పడతాయా..?

రెండు మూడు సార్లుగా వాయిదా పడుతూ వచ్చిన ఆర్.ఆర్.ఆర్ సినిమా ఫైనల్ గా 2022 జనవరి 7న రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. ఆల్రెడీ 2022 సంక్రాంతి బరిలో ప్రభాస్ రాధే శ్యాం, మహేష్ సర్కారు వారి పాట, పవన్ భీమ్లా నాయక్ లు వస్తున్నాయి. అయితే అనూహ్యంగా ట్రిపుల్ ఆర్ రిలీజ్ ఎనౌన్స్ మెంట్ రావడంతో సంక్రాంతి సినిమాలు వెనక్కి తగ్గాలని చూస్తున్నాయి. వీటిలో ప్రభాస్ రాధే శ్యాం అనుకున్న డేట్ కు వచ్చే అవకాశాలు ఉండగా మహేష్ సర్కారు వారి పాట, పవన్ భీంలా నాయక్ ఈ రెండు సినిమాలు వెనక్కి తగ్గుతాయని తెలుస్తుంది.

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే మహేష్, పవన్ సినిమాలు వాయిదా వేయాలని చూస్తున్నారు. ప్రభాస్ రాధే శ్యాం మాత్రం ఆర్.ఆర్.ఆర్ తో ఢీ కొట్టాలని చూస్తుంది. అయితే అప్పటికే ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ కు రాధే శ్యాం కు వారం రోజులు గ్యాప్ ఉంది కాబట్టి రాధే శ్యాం సినిమాకు పెద్దగా ఎఫెక్ట్ పడే ఛాన్స్ లేదు.