ప్రభాస్ తో సందీప్ వంగ..!

యంగ్ రెనల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. రాధే శ్యాం తర్వాత ఆదిపురుష్, సలార్ సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. ఈ రెండు సినిమాలు ఒకేసారి పూర్తి చేసే ప్లాన్ లో ఉన్నాడు. ఇక ఈ సినిమాల తర్వాత నాగ్ అశ్విన్ డైరక్షన్ లో ప్రభాస్ ప్రాజెక్ట్ కె సినిమా ప్లానింగ్ లో ఉంది. 500 కోట్ల భారీ బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు. 

ఇక ఇదిలాఉంటే ప్రభాస్ 25వ సినిమాగా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగ డైరక్షన్ లో ప్రభాస్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ప్రభాస్ 25వ సినిమాగా ఈ ప్రాజెక్ట్ వస్తుంది. ప్రస్తుతం సందీప్ వంగ బాలీవుడ్ లో యానిమల్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ తో సినిమా ఉంటుందని టాక్. మరి ప్రభాస్, సందీప్ వంగ కాంబో సినిమా ఎలాంటి వస్తుందో చూడాలి.