యుప్ టివి బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ సూర్య..!

రీసెంట్ గా అభిబస్ కు ప్రచారకర్తగా సైన్ చేసిన మహేష్ చెంత మరో క్రేజీ ప్రాజెక్ట్ వచ్చింది. ఆన్ లైన్ ఐపి టివిగా ప్రసిద్ధి గాంచిన యుప్ టివి వారు తమ బ్రాండ్ ను ఇంకాస్త బలంగా చేసుకునే క్రమంలో టాలీవుడ్ లో మహేష్, కోలీవుడ్ లో సూర్యలను తమ బ్రాండ్ అంబాసిడర్ లుగా ఎంపిక చేసుకున్నారు. ఇక దీనికి కోసం భారీ మొత్తాన్నే వారికి సమర్పిస్తున్నారట యుప్ టివి వారు.

ఇక ఈ విషయం గురించి ఎనౌన్స్ చేసే కార్యక్రమం సోమవారం తాజ్ కృష్ణాలో జరుగనున్నదట. ఈ ప్రోగ్రాంలో మహేష్ పాల్గొనే అవకాశం ఉంది. ఓ పక్క సినిమాల్లో బిజీగా ఉంటూనే సౌత్ లో ఏ స్టార్ హీరో దక్కించుకోలేని వాణిజ్య ప్రకటనలను మహేష్ సొంతం చేసుకున్నాడు. ఆన్ లైన్ ఐపిటివిగా ఫారిన్ లో ఎక్కువ పాపులారిటీ సంపాదించిన యుప్ టివి విస్తరణలో భాగంగా ఇప్పుడు తమ బ్రాండ్ ను ఇంకాస్త పెంచుకునే దిశగా అడుగులు వేస్తుంది.

స్టార్ హీరోల చేత ఏ ప్రొడక్టైనా సరే మార్కెట్ లో ఇంట్రడ్యూస్ చేస్తే అది ఇంకాస్త ఎక్కువ ప్రజల్లో వెళ్లే అవకాశం ఉన్నదని ప్రతి ప్రొడక్ట్ యాజమాన్యం తమకు స్టార్స్ తో వాణిజ్య ప్రకటనలను ప్లాన్ చేస్తుంటారు. ప్రస్తుతం ఫాంలో ఉన్న మహేష్ చేతిలో ఇప్పటికే డజనుకి పైగా బ్రాండ్ లు తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకుంటున్నాయి.