సేమ్ టూ సేమ్ దించేయలేదట..!

మలయాళ ప్రేమం రీమేక్ గా తెలుగు ప్రేమం ప్రేక్షకులను ప్రేమ పరవశంలో ముంచేందుకు రాబోతుంది. దసరా బరిలో దిగుతున్న ఈ సినిమా మీద అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే మలయాళ ప్రేమం సినిమాను తెలుగు మార్కెట్ కు తగ్గట్టుగా మార్చేశాడట దర్శకుడు చందు మొండేటి. ఈ విషయాన్ని తెలుగు ప్రేమం హీరో నాగ చైతన్యనే చెప్పడం విశేషం.

ఇక అక్కడ సినిమాలన్ని చాలా పొయెటిక్ గా ఉంటాయి.. మలయాళ ఆడియెన్స్ కు అలా కనెక్ట్ అవుతాయి కాని మన దగ్గర అలా ఉండకూడదు. అందుకే సినిమాను సాధ్యమైంతవరకు తెలుగు ప్రేక్షకుల అభిరుచి మేరకు మార్చేశాడట చందు మొండేటి. ఇక ఆ సినిమాలో హీరో బేకరి ఓనర్ గా కనిపిస్తాడు కాని తెలుగులో అలా కాకుండా వేరేలా చేస్తాడట. ముఖ్యంగా మలయాళ ప్రేమంలో లాస్ట్ హాఫ్ ఆన్ హవర్ ఉండే మడోన్నా సెబాస్టియన్ పాత్ర ఇక్కడ ఇంకాస్త ఎక్కువ చేశారట అది ఎందుకు ఏంటి అన్నది తెర మీదే చూడాలని అంటున్నాడు చైతు. 

ఇక కెరియర్ ప్రారంభించ నాటి నుండి నాగ చైతన్య సినిమా మీద ఈ రేంజ్ అంచనాలు కాని ప్రీ రిలీజ్ కాని జరగడం ఇదే మొదటిసారి.. సినిమా కోసం యూత్ అంతా ఎదురుచూస్తున్నారు. ఓపెనింగ్ అయితే అదరగొట్టేస్తుంది అని చెప్పేయెచ్చు ఇక సినిమా గాని యూత్ కు కనెక్ట్ అయితే కనుక చైతు కూడా ఓ అరుదైన రికార్డ్ సొంతం చేసుకునే అవకాశం ఉంది.