
కొన్నాళ్లుగా చర్చల్లో ఉన్న నాగ చైతన్య, సమంతల మ్యారేజ్ రిలేషన్ పై వచ్చిన ఊహాగానాలు అందరికి తెలిసిందే. నాగ చైతన్య, సమంత ఇద్దరు ఈ విషయంపై క్లారిటీ ఇచారు. తామిద్దరం విడిపోతున్నట్టు ప్రకటించారు చైతన్య, సమంత. తాము విడిపోతున్నాం అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని.. తమ దారులు వేరని.. ఇకపై స్నేహితులుగా కొనసాగుతామని తెలిపారు.
మా అభిమానులు.. శ్రేయోభిలాషులందరికి.. ఇక నుండి మేము భార్య భర్తల బంధానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాం. అనేక చర్చలు, ఆలోచన అనంతరం మేమిద్దరం విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. పదేళ్లుగా కొనసాగిన మా స్నేహం.. వివాహం చేసుకునేందుకు కీలకంగా మారింది. ఈ కష్ట సమయంలో అభిమానులు, సన్నిహితులు, మీడియా సహకారం కాఅలని అన్నారు. 2017 అక్టోబర్ లో చైతన్య, సమంత గోవాలో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఎవరి దారి వారు చూసుకోవాలని నిర్ణయించుకున్నారు.