
మాస్ మహరాజ్ రవితేజ ఖిలాడి సినిమా రిలీజ్ కు రెడీ అవుతుండగా శరత్ మండవ డైరక్షన్ లో వస్తున్న రామారావు ఆన్ డ్యూటీ సెట్స్ మీద ఉంది. ఇక రవితేజ తన నెక్స్ట్ సినిమా ఫిక్స్ చేసుకున్నారు. కొన్నాళ్లుగా డిస్కషన్స్ లో ఉన్న నక్కిన త్రినాథ రావు డైరక్షన్ లో రవితేజ సినిమా మొదలవుతుంది. రవితేజ 69వ సినిమాగా ఇది వస్తుంది. అక్టోబర్ 4 నుండి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. దీనికి సంబందించిన అప్డేట్ బయటకు వచ్చింద్ది.
క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రవితేజ ఖిలాడితో కూడా ఆడియెన్స్ కు అదే ట్రీట్ ఇవ్వాలని చూస్తున్నాడు. రామారావు సినిమా కూడా భారీ అంచనాలతో వస్తుంది. రవితేజ 69వ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాటరీ, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో వస్తుంది. టి.జి విశ్వ ప్రసాద్, అభిషేక్ నామా కలిసి నిర్మిస్తున్నారు. సినిమాలో మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది తెలియాల్సి ఉంది.