పవన్ కళ్యాణ్ ను కలిసిన టాలీవుడ్ నిర్మాతలు..!

ఏపీలో టికెట్ల రేట్లు.. 100 పర్సెంట్ థియేటర్ ఆక్యుపెన్సీ గురించి నిర్మాతలు కొందరు ఇప్పటికే ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించిన విషయం తెలిసిందే. అంతకుమందు చిరంజీవి, నాగార్జునతో సహా కొందరు సినీ పెద్దలు ఏపీ సీ.ఎం జగన్ ను కలిసి ఈ విషయాల గురించి చర్చించారు. అయితే రిపబ్లిక్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారింది.

ఆ గొడవని పక్కన పెట్టి నిర్మాతలు కొందరు ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేర్ని నానిని కలిసి టికెట్ల రేట్లపై.. ఆన్ లైన్ టికెట్ విధానంపై చర్చించారు. ఆ తర్వాత నిర్మాతలు పవన్ కళ్యాణ్ ను కూడా కలిశారు. దిల్ రాజు, డివివి దానయ్య, సునీల్ నారంగ్, బన్నీ వాసు, మైత్రి నవీన్, వంశీ రెడ్డిలు పవన్ కళ్యాణ్ ను మంగళగిరిలో కలిశారు. పవన్ ను మర్యాదపూర్వకంగానే కలిసినట్టు చెప్పారు. సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యల గురించి చర్చించినట్టు తెలుస్తుంది.