మా ఎన్నికలు రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నట్లు సాగుతున్నాయి. ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ తన దైవ సమానులు, శ్రేయోభిలాషుల సూచన మేరకు పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. తెలంగాణ సెంటిమెంటుతో మా ఎన్నికల బరిలో దిగిన మరో నటుడు సీవీఎల్ నరసింహరావు తన మ్యానిఫెస్టోను ప్రకటించిన తరువాత తాను కూడా పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించడం విశేషం. మా సంక్షేమం దృష్టిలో ఉంచుకొని పోటీ నుంచి విరమించుకొంటున్నట్లు ఆయన ప్రకటించారు.
దీంతో ఇప్పుడు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మాత్రమే బరిలో మిగిలారు. ఇరువురూ కూడా తమ ప్యానల్ తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇరువురిలో ఎవరు గెలుస్తారో తెలియాలంటే ఈ నెల 10న మా ఎన్నికలు జరిగే వరకు ఎదురు చూడాల్సిందే.