ఆ సీక్రెట్ ఇదేనట..!

నిన్న జరిగిన బాహుబలి ప్రెస్ మీట్ లో ప్రభాస్ గురించి అక్టోబర్ 5న ఓ న్యూస్ చెబుతా అంటూ ఊరించిన రాజమౌళి ప్రభాస్ ఫ్యాన్స్ నే కాదు సిని అభిమానులను కన్ ఫ్యూజన్లో పడేశాడు. అయితే ఆ సీక్రెట్ ఏమై ఉంటుందా అని తెలుసుకునే లోపే ఏకంగా అది బయటకు వచ్చేసింది. సెలబ్రిటీ మైనపు బొమ్మల్లో టుస్సాడ్స్ గురించి ఇదవరకే విని ఉన్నాం. అయితే ఆ మ్యూజియంలో ప్రభాస్ మైనపు బొమ్మ పెట్టబోతున్నారట. ఇదే విషయాన్ని అక్టోబర్ 5న ఎనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నాడు రాజమౌళి.

అయితే ఈరోజు ఆ టీంకు సంబందించిన వారే ఆ మైనపు బొమ్మకు సంబందించిన పిక్ రిలీజ్ చేయడంతో విషయం లీక్ అయ్యింది. అయితే ఇక దీనికి రాజమౌళి కూడా స్పందించి నేను చెప్పదలచుకున్న విషయం కూడా ఇదే.. ఇప్పటి రోజుల్లో ఏ విషయాన్ని అంత ఈజీగా దాచలేము అంటున్నాడు జక్కన్న. అయితే సౌత్ సెలబ్రిటీస్ లో ఈ అత్యుత్తమ ఘనత సాధించిన హీరోగా ప్రభాస్ ఓ కొత్త సంచలనం సృష్టించాడు. ఇదవరకు ఈ మ్యూజియంలో ప్రధానమంత్రి నరేంద్ర మోది మైనపు బొమ్మ ఉంచడం జరిగింది.