
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమా పుష్ప. పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమాలో కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా నుండి ఇప్పటికే టీజర్ తో పాటుగా దాక్కో దాక్కో మేక సాంగ్ రిలీజైంది. లేటెస్ట్ గా పుష్ప సినిమా నుడి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
పుష్ప సినిమాలో రష్మిక శ్రీవల్లి పాత్రలో నటిస్తుందని తెలుస్తుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా సినిమాలో రష్మిక కూడా మాస్ లుక్ తో కనిపిస్తుందని తెలుస్తుంది. రెండు పార్ట్ లుగా వస్తున్న పుష్ప సినిమా ఫస్ట్ పార్ట్ క్రిస్ మస్ రేసులో రిలీజ్ ఫిక్స్ చేశారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచేలా ప్లాన్ చేస్తున్న పుష్ప ఈసారి నేషనల్ లెవల్ లో అల్లు అర్జున్ సత్తా చాటాలని ఫిక్స్ అయ్యాడు.