శర్వానంద్ మరో మల్టీస్టారర్..!

యువ హీరో శర్వానంద్ ప్రస్తుతం సిద్ధార్థ్ తో మహా సముద్రం సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అజయ్ భూపతి డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 14న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమా తర్వాత కిశోర్ తిరుమల డైరక్షన్ లో ఆడాళ్లు మీకు జోహార్లు సినిమా చేస్తున్నాడు శర్వానంద్. ఇక ఈ సినిమాలతో పాటుగా మరో మల్టీస్టారర్ సినిమాకు సైన్ చేశాడట శర్వానంద్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శర్వానంద్ తో పాటుగా రానా కూడా నటిస్తాడని టాక్.

బాహుబలి సినిమా నుండి రాబోతున్న భీంలా నాయక్ వరకు మల్టీస్టారర్ సినిమా అంటే వెంకటేష్ గురించి ఎలా ఆలోచిస్తారో యువ హీరోల్లో రానా గురించి అదేలా ఆలోచిస్తారు. ఈ క్రమంలో రానా, శర్వానంద్ మల్టీస్టారర్ సినిమా వస్తుందని అంటున్నారు. ఈ సినిమాకు డైరక్టర్ ఎవరు.. ఎలాంటి కథతో ఈ సినిమా వస్తుంది అన్నది తెలియాల్సి ఉంది.