సమంత మతం మరాడమా.. చాన్సే లేదట

నిన్నటిదాకా రీల్ లైఫ్ లో ప్రేమికులుగా ఉన్న చైతు, సమంతలు ఇప్పుడు రియల్ లైఫ్ లో కూడా ఒక్కటయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే వీరి లవ్ మ్యాటర్ ఇరువురి ఇళ్లల్లో తెలియడం గ్రీన్ సిగ్నల్ రావడం అంతా జరిగింది. అయితే ఇక హాట్ న్యూస్ గా ఉన్న ఈ చైతు, సమంతల గురించి ఏ చిన్న న్యూస్ వచ్చినా అది పెద్ద సెన్షేషన్ అవుతుందిఒ. ఆ క్రమంలో రీసెంట్ గా చైతు, సమంతలతో కింగ్ నాగార్జున పూజ చేయిస్తున్న పిక్ ఒకటి సోషల్ సైట్స్ లో దర్శనమిచ్చింది.

ఆ పిక్ చూసి సమంత క్రిస్టియానిటీ వదిలి మళ్లీ హిందు మతంలోకి వచ్చేసిందని ఏవేవో రాసేశారు. అయితే సమంత మీద ప్రేమ గురించి ఇన్నాళ్లు ఓపెన్ అవని చైతు ఫైనల్ గా మొత్తం రివీల్ చేశాడు. ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో ప్రేమించుకున్నామని పెళ్లికి నేనే సమంతకు ముందు ప్రపోజ్ చేశా అని అన్నాడు. ఇక తను మత మార్పిడి మీద వస్తున్నవన్ని రూమర్లే అని కొట్టిపడేశాడు.

ఏ మతమైనా వ్యక్తిగా తనను ఇష్టపడ్డానని ఆమె పరిచయం కాక ముందు నాలో షార్ట్ టెంపర్ ఉండేది కాని సమంత లైఫ్ లో రావడం వల్ల తనని తాను చాలా మార్చుకున్నానని అంటున్నాడు చైతన్య. ఇక మీడియా హడావిడి చేసిన ఆ ఫోటోలు కేవలాం స్టూడియోలో ఓ పూజ జరుగుతుండగా ఆ టైంలో ఇద్దరం అక్కడికి వెళ్లగా అవే సమంత మతం మార్చుకున్నట్టుగా క్రియేట్ చేశారని అన్నాడు. తన పెళ్లి గురించి తానే ప్రత్యేకంగా అందరికి చెబుతానని మీడియా ఏం తొందర పడాల్సిన అవసరం లేదు అని చురకలంటించాడు నాగ చైతన్య.