
సంచలనానికి కేరాఫ్ అడ్రెస్ గా ఉంటూ డైరక్టర్ గా తను తీసే సినిమాలు ఎలా ఉన్నా నిత్యం వార్తల్లో నిలిచే వ్యక్తి రాం గోపాల్ వర్మ. ఒకరిని లేపాలన్నా.. వారిని పాతాళానికి తొక్కాలన్నా ఆర్జీవి తర్వాతే ఎవరైనా అన్నట్టుగా ఆయన కామెంట్స్ ఉంటాయి. ఇప్పటికే ఆయన తీసే బయోపిక్ లతో హాట్ టాపిక్ గా నిలుస్తున్న రాం గోపాల్ వర్మ. కొద్దిగా గ్యాప్ ఇచ్చాడు ఏంటా అని అనుకునే సరికి మరో బయోపిక్ తో అందరికి షాక్ ఇచ్చాడు. లేటెస్ట్ గా వర్మ చేస్తున్న బయోపిక్ ఏంటన్నది రివీల్ చేశాడు. కండ టైటిల్ తో సినిమా చేస్స్తున్నాడు ఆర్జీవి.
తెలంగాణా రాజకీయాల్లో కీలక వ్యక్తులైన కొండ మురళి, సురేఖల జీవితం గురించి ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. కొండ మురళి చేసిన ఉద్యమాల గురించి ఆర్జీవి చెప్పదలచుకున్నాడు. కొండ మురళి బయోపిక్ గా వస్తున్న ఈ సినిమాలో కొండ మురళి, సురేఖ, రామకృష్ణ పాత్రదారులు ఉంటార్. ఆర్జీవి వాయిస్ నోట్ తో ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ చేశాడు. కొండ మురళిని ఒప్పించి ఆర్జీవి ఈ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. మొన్నటివరకు ఆంధ్రా రాజకీయాలు వంగవీటి రంగ, ఎన్.టి.ఆర్, సి.బి.ఎన్ ల మీద వరుస సినిమాలు చేసిన ఆర్జీవి సడెన్ గా తెలంగాణా పొలిటిషియన్స్ మీద దృహ్టి మళ్లడం అందరిని షాక్ అయ్యేలా చేస్తుంది.