
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో వస్తున్న సినిమా సలార్. ఈ సినిమాను కె.జి.ఎఫ్ నిర్మించిన హోంబలె సినిమాస్ వారే నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. సలార్ సినిమా కోసం ప్రశాంత్ నీల్ హాలీవుడ్ టెక్నాలజీని వాడుతున్నట్టు తెలుస్తుంది. సలార్ సినిమా కోసం డార్క్ సెంట్రిక్ థీం తో యాక్షన్ సీన్స్ ప్లాన్ చేస్తున్నారట.
హాలీవుడ్ సినిమాలు టెనెట్, బ్యాట్ మెన్ ట్రియాలజీ, మ్యాట్రిక్స్ సినిమాల్లో వాడిన డార్క్ సెంట్రిక్ థీం ను ఈ సినిమా కోసం వాడుతున్నట్టు తెలుస్తుంది. ఇందుకోసం హాలీవుడ్ టెక్నిషియన్స్ ను కూడా రంగంలోకి దించుతున్నట్టు తెలుస్తుంది. సలార్ కోసం ప్రశాంత్ నీల్ భారీ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. 2022 ఏప్రిల్ రిలీజ్ ప్లాన్ చేసిన సలార్ వచ్చే ఏడాది చివరకు రిలీజ్ అవుతుందని అంటున్నారు.