
మెగా పవర్ స్టార్ రాం చరణ్, శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు బ్యానర్ లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఒక భారీ ఫైట్ ప్లాన్ చేస్తున్నారట. సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్ లో భాగంగా శంకర్ ఓ ట్రైన్ ఫైట్ రాసుకున్నారట. దానికోసం 10 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నట్టు టాక్. చరణ్, శంకర్ కాంబోలో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కియరా అద్వాని ఫిక్స్ అయ్యింది.
సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా భారీ అంచనాలతో వస్తుంది. ఐ సినిమా తర్వాత ఇండియన్ 2 మొదలు పెట్టినా అది మధ్యలో ఆగిపోయింది. అందుకే శంకర్ చరణ్ సినిమాతో తానేంటి అన్నది ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నారు. చరణ్ కూడా ఆర్.ఆర్.ఆర్, ఆచార్యల తర్వాత శంకర్ డైరక్షన్ లో సినిమా చేయడం తన రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు.